నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. పార్లమెంట్ సభ్యులు పి.రాములు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పి.పద్మావతి, జిల్లా కలెక్టర్ యల్.శర్మన్, స్థానిక శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మొదటగా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకుని, సింగోటం రిజర్వాయర్ విస్తరణ కోసం చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారింది: నిరంజన్ రెడ్డి - తెలంగాణ వార్తలు
కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారింది: నిరంజన్ రెడ్డి
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్, కొల్లాపూర్ మండలం కుడికిల్లలో 33/11 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. కరెంటు, రక్షిత నీటి సరఫరాలో తెలంగాణ నంబర్ వన్ అని కేంద్రమే ఇటీవల ప్రకటించిందని తెలిపారు. నూతన వ్యవసాయ విధానాల మూలంగా ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారిందని చెప్పారు.
ఇదీ చదవండి: 'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'