తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నియంత్రణపై మంత్రి నిరంజన్​ రెడ్డి సమీక్ష - తెలంగాణ వార్తలు

కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంచి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​లో కరోనా టాస్క్​ఫోర్స్​ బృందం, ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి

By

Published : May 13, 2021, 11:07 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కరోనా టాస్క్​ఫోర్స్​ బృందం, ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి సమీక్ష నిర్వహించారు. కరోనా ప్రస్తుత పరిస్థితి, నివారణ, ఆక్సిజన్ బెడ్స్, ఐసోలేషన్ సెంటర్ వివరాలు, కావలసిన మందులు, కరోనా టెస్టుల నిర్వహణ, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోలుపై చర్చించారు.

కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంచి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాలన్నారు. కరోనా రోగులకు మందుల కొరత లేదని అవసరమైనన్ని మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఏ ఒక్కరూ అధైర్య పడవద్దని.. కరోనాకు ధైర్యం ఒక్కటే మందు అని చెప్పారు. కొవిడ్​​ వస్తే ఆందోళన చెందకుండా పరీక్షలు చేయించుకొని ధైర్యంగా చికిత్సలు పొందాలని సూచించారు. జిల్లాలో కరోనా చికిత్సకు కావలసిన ఆక్సిజన్, మందులు, సిబ్బంది ఏం కావాలన్నా టాస్క్ ఫోర్స్ కమిటితో చర్చించి తక్షణమే సమకూర్చుకోవాలని కలెక్టర్​కు సూచించారు.

రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు ఎన్ని కావాలంటే అన్ని ఇండెంట్ పెట్టాలని అందులో నుంచి 5 నుంచి 10 శాతం వరకు ప్రైవేట్ ఆస్పత్రులకు అందించాలన్నారు. ధాన్యం తరలింపునకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వాహనాలను ఉపయోగించుకోవాలన్నారు. ధాన్యం నిలువ చేసేందుకు అగ్రికల్చర్, హౌసింగ్ గోదాములతోపాటు, రైతువేదికలను కూడా ఉపయోగించుకోవలసిందిగా సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌

ABOUT THE AUTHOR

...view details