నిర్దేశించిన ప్రకారం పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణం పరిశీలించిన ఆయన... విజయదశమి పండుగ వరకల్లా నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
సకాలంలో పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ - తాండ్ర గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామాన్ని అదనపు కలెక్టర్ మనుచౌదరి సందర్శించారు. గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణం పరిశీలించారు. దసరా పండుగలోపు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
సకాలంలో పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
అనంతరం గ్రామంలో నిర్వహించిన హరితహారం, పల్లె ప్రకృతి వనానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. డంపింగ్ యార్డు, స్మశాన వాటిక నిర్మాణాల్లో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. పనుల పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సుశీల, ఇతర సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:భట్టికి లక్ష ఇళ్లు చూపించి తీరుతాం : మంత్రి వేముల