నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని పంజుగుల, గుండూరు, లింగసానిపల్లి, రఘుపతిపేట గ్రామాల్లో అదనపు కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, నాటవలసిన మొక్కలు, ఆయా గ్రామాల్లో తీసిన గోతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హరితహారంలో నాటిన ప్రతిమొక్కనూ బతికించాలి: అదనపు కలెక్టర్ - latest news of nagarkurnool district
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అదనపు కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులుతో ఆయన మాట్లాడారు.
పలు గ్రామాల్లో అదనపు కలెక్టర్ మనుచౌదరి ఆకస్మిక పర్యటన
గ్రామ కార్యదర్శులతో నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కల రక్షణకు కంచె నిర్మించాలని సూచించారు. ఆరో విడత హరితహారంలో ప్రజలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం