కరోనా నియంత్రణ కోసం పీఎం, సీఎం సహాయనిధికి దాతలు అందించిన నిధులు, చెక్కుల్లో భారీగా అవినీతి జరిగిందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని భాజపా కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తిలో కొందరు దాతలు ఇచ్చిన విరాళాలను... ఓ ఎమ్మెల్యే తన బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఎంత వరకు సమంజసమని ఆచారి ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన వ్యక్తిగత ఖాతాలో 7 లక్షల71 వేల రూపాయలు జమ చేసుకున్నారని... అందుకు సంబంధించిన పత్రాలను ఆయన ప్రవేశపెట్టారు. రూ. 25 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఇవ్వాలన్న ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధుల సేకరణ జరిగిందన్నారు.
దాతల విరాళాలు దుర్వినియోగం : తల్లోజు ఆచారి - National BC Commission member Achari Latest News
కరోనా నివారణ కోసం పీఎం, సీఎం సహాయనిధికి దాతలు అందించిన విరాళాలు దుర్వినియోగమయ్యాయని... జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధుల సేకరణ జరిగిందన్నారు.
తల్లోజు ఆచారి