నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 20,684 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. 14,055 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రెండో వార్డులో 96.92 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 20వ వార్డులో 52.92 శాతం పోలింగ్ నమోదైంది.
మినీ పోల్స్: ప్రశాంతగా ముగిసిన పోలింగ్... గెలుపుపై ఉత్కంఠ - achampet polling updates
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలికలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 68 శాతం పోలింగ్ నమోదు కాగా... అత్యధికంగా 96.92 శాతం రెండో వార్డులో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా 20వ వార్డులో 52.92 శాతం పోలింగ్ నమోదైంది.
2016లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం తక్కువే నమోదైందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో మొత్తం 18,614 ఓటర్లకు గానూ 13,193 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పట్లో 70 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు గెలుచుకున్నది తెరాసనే. 20వ వార్డుల్లో 20 వార్డులు తెరాస అభ్యర్ధులే గెలుచుకున్నారు. కానీ.. ఈసారి తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు పురపాలిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అన్ని వార్డుల్లోనూ మూడు పార్టీలు అభ్యర్ధుల్ని బరిలో నిలిపాయి. ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉండనుంది. పార్టీల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితాల కోసం అన్నిపార్టీల అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు...
వార్డు నెంబర్ | మొత్తం ఓట్లు | పోలైన ఓట్లు | పోలింగ్ శాతం | వార్డు నెంబర్ | మొత్తం ఓట్లు | పోలైన ఓట్లు | పోలింగ్ శాతం |
1వ వార్డు | 1087 | 721 | 66.62 | 11వ వార్డు | 952 | 626 | 65.75 |
2వ వార్డు | 1105 | 850 | 96.92 | 12వ వార్డు | 940 | 611 | 65 |
3వ వార్డు | 941 | 663 | 70.45 | 13వ వార్డు | 1078 | 780 | 72.35 |
4వ వార్డు | 961 | 619 | 64.41 | 14వ వార్డు | 1088 | 771 | 70.86 |
5వ వార్డు | 975 | 672 | 68.91 | 15వ వార్డు | 1106 | 754 | 68.17 |
6వ వార్డు | 939 | 720 | 76.67 | 16వ వార్డు | 964 | 729 | 75.62 |
7వ వార్డు | 952 | 762 | 79.99 | 17వ వార్డు | 1035 | 738 | 71.3 |
8వ వార్డు | 1107 | 792 | 71.52 | 18వ వార్డు | 993 | 678 | 68.27 |
9వ వార్డు | 1118 | 656 | 58.67 | 19వ వార్డు | 1069 | 626 | 58.55 |
10వ వార్డు | 1214 | 736 | 60.62 | 20వ వార్డు | 1060 | 561 | 52.92 |