ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటన జరిగింది. నిన్న అంతా మంత్రితో కలిసి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అలసిపోయి ఇంటికి వెళ్లిపోయారు అనుకున్నారు అందరూ. కానీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లకుండా అచ్చంపేటలోని స్పోర్ట్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టుకొచ్చి టెన్నిస్ ఆడుతూ... అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.
టెన్నిస్ ఆడిన అచ్చంపేట ఎమ్మెల్యే - టెన్నిస్ ఆడిన అచ్చంపేట ఎమ్మెల్యే
శరీరానికే కాదు మానసికంగా కూడా ధృడంగా ఉండేందుకు ఆటలు ఎంతగానో దోహదపడుతాయని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
టెన్నిస్ ఆడిన అచ్చంపేట ఎమ్మెల్యే