నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైలం-హైదరాబాద్ హైవే రోడ్డుపై చెన్నారం సమీపంలో బైకు, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈరట్వానిపల్లి నుంచి సత్తయ్య, నిరంజన్ కలిసి అచ్చంపేట వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు విగతజీవులుగా పడున్న వీరిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అచ్చంపేటలో కారు, బైకు ఢీ.. ఇద్దరు మృతి - accident in achampet latest news
ద్విచక్ర వాహనం, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం సమీపంలో జరిగింది.
అచ్చంపేటలో కారు, బైకు ఢీ.. ఇద్దరు మృతి