నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో కనిపించకుండా పోయిన ఓ అమ్మాయి... పట్టణ శివారులోని వ్యవసాయ బావిలో శవమై తేలింది. ఆ అమ్మాయి శనివారం ఇంట్లో నుంచి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
'కనిపించకుండా పోయిన అమ్మాయి శవమై తేలింది' - kollapur news
అమ్మాయి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అంతలోనే నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ శివారులో శవమై తేలింది.
'కనిపించకుండా పోయిన అమ్మాయి శవమై తేలింది'
ఈరోజు ఉదయం కొల్లాపూర్ శివారులోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... అమ్మాయిని ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. బావి పక్కనే మద్యం బాటిల్ కనపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.