అటవీ ప్రాంతం నుంచి మేకల మందతో కలిసి వచ్చిన ఓ జింకను.. స్థానికులు కాపాడి అడవిలోకి వదిలారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిందీ ఘటన.
లింగాల మండల కేంద్రానికి చెందిన ఓ కాపరి మేకలను మేపడానికి.. స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తిరుగుముఖం పట్టాడు. మేకలను కొట్టంలోనికి పంపుతుండగా వాటితో కలిసి వచ్చిన జింకను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు.