తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు' - నాగర్ కర్నూల్ జిల్లా

ప్రమాదావశాత్తు ఆటో బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలైన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా చుక్కాయిపల్లిలో చోటుచేసుకుంది.

'ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు'

By

Published : Sep 28, 2019, 11:20 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లిలోని చెరువు కట్ట వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను కొల్లాపూర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్​ ఒక్కసారిగా బ్రేకు వేయడం వల్ల ఆటో అదుపు తప్పి, బోల్తా పడిందని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

'ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు'

ABOUT THE AUTHOR

...view details