తెలంగాణ

telangana

ETV Bharat / state

ACCIDENT: ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం.. ఒకరి పరిస్థితి విషమం - nagarkurnool district accident news

ఒకరు శ్రీశైలం దర్శించుకుని వస్తున్నారు.. మరొకరు శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నారు.. ఈ రెండు బృందాలను.. అతివేగం కాటేసింది. వీరిరువురి కార్లు ఎదురెదురుగా ఢీకొని.. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధాని సహా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రమాదం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

రెండు కార్లు ఢీ.. ఏడుగురి దుర్మరణం.. ఒకరి పరిస్థితి విషమం
రెండు కార్లు ఢీ.. ఏడుగురి దుర్మరణం.. ఒకరి పరిస్థితి విషమం

By

Published : Jul 24, 2021, 4:42 AM IST

Updated : Jul 24, 2021, 6:21 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పనూతల మండలం పెరట్వాన్​పల్లి శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో.. ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నారం గేటుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడు నరేశ్​ను హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్​కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన స్నేహితులు నరేశ్​, వంశీ, వెంకటేశ్, కార్తీక్ గురువారం శ్రీశైలం వెళ్లారు. శుక్రవారం మధ్నాహ్నం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ నుంచి శివకుమార్, సుబ్బలక్ష్మి, లవకుమార్, వెంకటరమణమూర్తి కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ రెండు కార్లు ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టడంతో.. శ్రీశైలం నుంచి వస్తున్న కారులో ముగ్గురు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. మృతదేహాలను అతికష్టం మీద పోలీసులు వెలికి తీశారు.

అతి వేగమే కారణమా..

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. అనంతరం మృతదేహాలను అచ్చంపేట ఆసుపత్రి శవాగారంలో భద్రపరిచారు. మృతుల్లో శివకుమార్, సుబ్బలక్ష్మి తల్లీకుమారులు. వీరు హైదరాబాద్​కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతి వేగం కారణంగానే.. రెండు కార్లు బలంగా ఢీకొని ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ప్రముఖుల సంతాపం..

ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల రూపాయలు.. గాయపడిన వారికి రూ. 50 వేల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజుకు ఫోన్​ చేసి.. వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. మంత్రి నిరంజన్​రెడ్డి సహా పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Attack on RTC driver: బస్సు ఆపలేదనే కోపంతో డ్రైవర్‌పై దాడి

Last Updated : Jul 24, 2021, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details