ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10,879 మంది వైరస్ బారినపడ్డారు. బుధవారం మరో 566 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 152, నాగర్ కర్నూల్ జిల్లాలో 148, వనపర్తి జిల్లాలో 112, జోగులాంబ గద్వాలలో 107, నారాయణపేట జిల్లాలో 47 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో..
మహబూబ్‌నగర్ జిల్లాలో 152 కరోనా కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలోనే 62, జడ్చర్ల 31, అడ్డాకల్ 10, భూత్పూర్, గండీడ్‌లలో 8 చొప్పున, దేవరకద్ర, సీసీకుంటల్లో 7 మంది చొప్పున, రాజాపూర్, హన్వాడల్లో 6 చొప్పున, నవాబుపేట, మూసాపేటల్లో ముగ్గురు చొప్పున, బాలనగర్ మండలంలో ఒక్కరికి కరోనా కోరల్లో చిక్కుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్ కర్నూల్ జిల్లాలో 148 కరోనా కేసులు వెలుగుచూడగా.. జిల్లా కేంద్రంలో 18, కల్వకుర్తి 27, తిమ్మాజీపేట 15, అచ్చంపేట 14, కోడేరు, కొల్లాపూర్‌లలో 13 చొప్పున, తెల్కపల్లి 11, లింగాల 6, తాడూర్, అమ్రాబాద్, బల్మూర్, బిజినేపల్లి 4 చొప్పున, వెల్దండ 3, చారకొండ, వంగూర్ 2 చొప్పున, ఉప్పునుంతల, ఉర్కొండ మండలాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి జిల్లాలో 111 మంది వైరస్ బారినపడగా.. జిల్లా కేంద్రంలో 55, పెబ్బేరు 18, కొత్తకోట 9, ఘన్‌పూర్ 8, గోపాల్‌పేట 5, పాన్‌గల్ 4, పెద్దమందడి, మదనాపురంలో ఇద్దరు చొప్పున, చిన్నంబావి, రేవల్లి, వీపనగండ్లల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.