నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పుర ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండో రోజు 45 మంది అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. తెరాస తరఫున 25, కాంగ్రెస్ తరఫున 11, భాజపా తరఫున 7, ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పురపాలిక సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు.
అచ్చంపేట పుర పోరు: రెండో రోజు 45 మంది నామినేషన్లు - తెలంగాణ వార్తలు
అచ్చంపేట పురపాలిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు 45 మంది నామపత్రాలు దాఖలు చేశారు. నేడు చివరి రోజు కావడంతో మరింత మంది నామినేషన్ వేసే అవకాశం ఉంది.
అచ్చంపేట పురపాలక ఎన్నికలు, అచ్చంపేట నామినేషన్లు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ నామినేషన్ల గడువు చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడానికి అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్, భాజపాలు కసరత్తు చేస్తున్నాయి.
ఇదీ చదవండి:జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్