నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండపేటలో పాఠశాల బస్సు ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. శ్వేత, అనిల్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా మొదటి అమ్మాయి... మనోజ్ఞ ఇంటి ముందు ఆడుకుంటోంది. అటుగా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు ఢీకొనటం వల్ల చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ అజాగ్రత్తతోనే చిన్నారి మృతి చెందిందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. అజాగ్రత్తగా బస్సు నడిపిన డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
పాఠశాల బస్సు ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి - 4 YEARS CHILD DEAD DUE TO BUS ACCIDENT
అప్పటి వరకు ఇంటి ముందు చిరునవ్వులతో ఆడుకుంటోంది చిన్నారి. ఓర్వలేని మృత్యువు స్కూల్ బస్సు రూపంలో దూసుకొచ్చింది. చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు విడించింది ఆ బుజ్జాయి.
4 YEARS CHILD DEAD DUE TO BUS ACCIDENT