ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 13 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 356కి చేరింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 5 పాజిటివ్ కేసులు రాగా.. నాగర్‌కర్నూల్‌లో 4, వనపర్తి జిల్లాలో 2, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 356కు చేరిన కరోనా కేసులు - మహబూబ్‌నగర్ జిల్లా కరోనా వార్తలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కలవరపెడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 13 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 356కు చేరింది.
![ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 356కు చేరిన కరోనా కేసులు 356 Corona Cases in Joint Mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7965617-1062-7965617-1594351826557.jpg)
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 356కు చేరిన కరోనా కేసులు
మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన నలుగురికి కరోనా సోకగా.. వారిలో ఒకరు వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పని చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కరోనా బారినపడ్డారు. అచ్చంపేట పట్టణానికి చెందిన కిరాణ దుకాణ యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ కాల్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న తెలకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారణ కాగా.. హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నాడు.