పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటానన్నారు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. జిల్లాలోని 70 ఎంపీటీసీ, 5 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తెరాస కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్‌కు పంపుతామన్నారు. ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు సూచించారు.
జిల్లాలోని అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు మనవే - mlc
నాగర్‌కర్నూల్‌లోని అత్యధికంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు మనవే