తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుర్తిలో 17 మంది జూదగాళ్లు అరెస్టు - 17మంది జూదగాళ్లు అరెస్టు

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పట్టణ శివారులో 17మంది జూదగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30,412 నగదు, 14 చరవాణిలు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

17 gamblers arrested at Kalwakurthy in Nagarkarnool district
17మంది జూదగాళ్లు అరెస్టు

By

Published : Jun 11, 2020, 10:35 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పట్టణ శివారులో బొమ్మా- బొరుసు ఆడే స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 17మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్సై మహేందర్​ వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 30,412 నగదు, 14 చరవాణిలు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి స్టేషన్​కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేందర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details