నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆరోగ్య కేంద్రం ఆవరణలో పదిహేను రోజుల పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆసుపత్రి మెట్ల వద్ద పాప కన్పించగా... సిబ్బంది చేరదీశారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పాప సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఆస్పత్రి మెట్లపై 15 రోజుల పాప... సిబ్బంది చేరదీత
ఆస్పత్రిలోకి ప్రవేశించే మెట్లపై 15 రోజుల పాపను వదిలెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగింది. ప్రస్తుతం పాప సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆస్పత్రి మెట్లపై 15 రోజుల పాప... సిబ్బంది చేరదీత
పాపను ఎవరు వదిలి వెళ్లారన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా వదిలివెళ్లిన వారి వివరాలు తెలుసుకునే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.