తెలంగాణ

telangana

ETV Bharat / state

తండాపై కరోనా పంజా.. పండుగే కారణమా? - తెలంగాణ వార్తలు

నాగర్​కర్నూల్ జిల్లా చంద్రబండతండాలో ఒకేసారి 110మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇటీవల జరుపుకున్న ముత్యాలమ్మ పండుగ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలసకూలీలు ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో వైరస్ విజృంభించింది. వెంటనే అప్రమత్తమైన ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చర్యలు చేపట్టారు.

chandrabandathanda corona cases, covid positive cases
చంద్రబండతండాలో కరోనా కేసులు, కొవిడ్ పాజిటివ్ కేసులు

By

Published : Apr 26, 2021, 7:26 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండాలో కరోనా కోరలు చాస్తోంది. తండాలో 320 మందికి పరీక్షలు చేయగా 110మందికి పాజిటివ్​గా తేలింది. ఇటీవలె ముత్యాలమ్మ పండుగ కోసం వలస వెళ్లిన గిరిజనులు హైదరాబాద్, ముంబయి నుంచి సొంతూరికి వచ్చారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి పెరిగింది. సర్పంచ్ రాంలాల్ నాయక్, జడ్పీటీసీ గౌరమ్మ వెంటనే అప్రమత్తమై... తండాలో సోడియం హైపో క్లోరైడ్​ని పిచికారి చేయించారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ ఆర్థిక సాయంతో కొవిడ్ బారిన పడిన కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. అందరూ మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. తండాలో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించారు. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు

ABOUT THE AUTHOR

...view details