ములుగు గ్రామ పంచాయతీలో ఆదివారం నిర్వహించిన రెండో విడత పల్లె ప్రగతి ముగింపు సమావేశానికి జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ హాజరయ్యారు. గ్రామపంచాయతీ కార్యకలాపాల కోసం కొనుగోలు చేసిన జేసీబీ, ట్రాక్టర్కు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాయతీకి అందజేశారు. సమావేశానికి వచ్చిన నిరక్షరాస్యులకు అక్షరాభ్యాసం చేయించారు.
మీ పనితీరుకు నే పాదాక్రాంతం..! - latest news on mulugu zp chairmain
పారిశుద్ధ్య కార్మికులు బాగా పనిచేశారంటూ వారికి పాదాభివందనం చేశారు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్. ములుగులో నిర్వహించిన పల్లెప్రగతి ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మీ పనితీరుకు నే పాదాక్రాంతం..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక, రెండో విడత పల్లె ప్రగతిలో ములుగు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బాగా పనిచేశారంటూ వారిని కొనియాడారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను వేదికపైకి ఆహ్వానించి శాలువాతో సన్మానించి, వారికి ధన్యవాదాలు తెలిపారు.
మీ పనితీరుకు నే పాదాక్రాంతం..!
ఇదీ చూడండి: 'శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే'