తెలంగాణ

telangana

ETV Bharat / state

'ములుగులో ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం' - 'ములుగులో ప్రతీ ఎకరాకు నీళ్లందిస్తాం'

ములుగు మండలంలోని ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని జడ్పీ ఛైర్​పర్సన్​ కృష్ణ జగదీశ్వరి హామీ ఇచ్చారు. రామప్ప సరస్సు నుంచి నర్సంపేట నియోజకవర్గంలోని రంగయ్య చెరువుకు వెళ్లే మార్గాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ZP CHAIR PERSON VISITED DEVADULA PROJECT
'ములుగులో ప్రతీ ఎకరాకు నీళ్లందిస్తాం'

By

Published : May 2, 2020, 7:53 PM IST

దేవాదుల నీటిని మళ్లించి ములుగు మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జడ్పీ ఛైర్​ పర్సన్​ కృష్ణ జగదీశ్వరి తెలిపారు. రామప్ప సరస్సు నుంచి నర్సంపేట నియోజకవర్గంలోని రంగయ్య చెరువుకు వెళ్లే మార్గాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

కొట్లాపూర్ సమీపంలో ఉన్న పంప్​హౌస్ నిండిన తర్వాత అక్కడి నుంచి నీటిని ములుగు మండలానికి మళ్లిస్తామని వివరించారు. రంగయ్య చెరువు, చింతల చెరువు, జంగాలపల్లి చెరువుల గొలుసుకట్టు ద్వారా నీటిని నింపేందుకు సాధ్యాసాధ్యాలను రైతులను అడిగి తెలుసుకుని నివేదిక తయారు చేస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:'కరోనా వైరస్ సహజసిద్ధంగానే ఉద్భవించింది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details