తెలంగాణ

telangana

ETV Bharat / state

మనసు దోచే లక్నవరం.. పర్యటకుల పాలిట స్వర్గధామం

సందర్శకుల మనస్సు దోచే లక్నవరం సరస్సులో... సరికొత్త హంగులు సమకూరుతున్నాయి. మూడో ఊయల వంతెన సరస్సుకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. జిప్ సైక్లింగ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Zip cycling on Laknavaram Lake makes it more beautiful
మనసు దోచే లక్నవరం.

By

Published : Jan 10, 2021, 7:42 PM IST

ఎటు చూసినా పచ్చని చెట్లు.. చుట్టూ గుట్టలు.. మధ్యలో సరస్సు. సరస్సు నడుమ మూడు వేలాడే వంతెనలు. తనివితీరా బోటింగ్, పర్యాటకులను ఆకర్షించేందుకు.. ఇంతకంటే ఇంకేం కావాలి. సహజ సిద్ధ అందాలను నెలవైన లక్నవరం.. నిజంగా పర్యాటకులకు స్వర్గధామమే. ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు అందాలు వీక్షించాలే కానీ... మాటల్లో వర్ణించనలవికాదు.

లక్నవరం.. పర్యటకుల పాలిట స్వర్గధామం

కొవిడ్‌ కారణంగా.. కొన్నాళ్లుగా కళ తప్పిన లక్నవరం.. మళ్లీ సరికొత్త హంగులతో... పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 2 వేలాడే వంతెనలకు తోడు.. మూడో వంతెన కూడా నిర్మాణం పూర్తయ్యింది. ఇక ఇటీవలే ప్రారంభించిన జిప్ సైక్లింగ్ రైడ్.... పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇంకా వాటర్ రోలర్, కయాకింగ్, సెల్ఫ్ బోటింగ్ కూడా... లక్నవరానికి వచ్చే సందర్శకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా.... తనివితీరట్లేదని పర్యాటకులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖల నుంచి కూడా.. పర్యాటకులు వచ్చి ఆహ్లాదం పొందుతున్నారు.

పెద్దవాళ్లు సైతం పిల్లల్లా మారి...సరదాగా గడుపుతున్నారు. ఆడుతూ పాడుతూ.. బోటు షికారు చేస్తూ... ఉల్లాసం పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details