దేశంలోను, రాష్ట్రంలోను మహిళలకు రక్షణ లేకుండా పోతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో మహిళలు చేసిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా మహిళా కమిషన్ లేదని... ఆడవారికి రక్షణ కల్పించాలని సీతక్క డిమాండ్ చేశారు.
అత్యాచారం, హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలి: సీతక్క
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.
మహిళలపై అత్యాచారం, హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలి: ఎమ్మెల్యే సీతక్క
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల పేర్లతో మభ్యపెడుతోందని ఆరోపించారు. మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని ఉరి తీయాలని... బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లేళ కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:జాతీయ రహదారిపై కాంగ్రెస్ ఆందోళన