ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో గత రెండు నెలలుగా నీటి సరఫరా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఓపిక నశించిపోయి మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో గత రెండు నెలలుగా తాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి భయానికి మహిళలు బయటికి వెళ్లలేక నీళ్లు తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా గ్రామపంచాయతీ పాలకమండలి, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విసుగు చెందిన మహిళలు ఆగ్రహంతో ఖాళీ బిందెలతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
నీటి ఎద్దడి: ఖాళీ బిందెలతో మహిళల నిరసన - mulugu district news
గత రెండు నెలలుగా నీటి సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ములుగు జిల్లా చల్వాయి గ్రామ మహిళలు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. పాలకమండలి, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇటు మిషన్ భగీరథ నీటి కనెక్షన్లలో నిర్లక్ష్యం, వాడవాడలకు ఉన్న బోర్లు అన్ని రిపేరుకు వచ్చి వాటిని బాగు చేయించడంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల మహిళలు ఆగ్రహంతో గ్రామపంచాయతీ ముందు నిరసనకు దిగారు. ఇప్పటికైనా గ్రామంలోని పాలకమండలి, అధికారులు తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని త్వరగా బోర్లు బాగు చేయించి, మిషన్ భగీరథ నల్లా పైపు కనెక్షన్ ప్రతి ఇంటికి ఇచ్చేలా చూడాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: మొక్కజొన్న పంటలపై వానరాల దాడి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు