ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయ సమీపంలోని అడవిలో మహిళను ఉరివేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ములుగు మండలం కొడిషకుంటు గ్రామానికి చెందిన రాధ, భర్త చనిపోవడం వల్ల కుమారుడితో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భోజ్యతో కొంత కాలంగా పరిచయం కొనసాగుతోన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తన తల్లి కనిపించడం లేదని రాధ కుమారుడు, బంధువులు గత నెల 28న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి... మహిళ కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేయగా... చివరిసారిగా భోజ్యతో మాట్లాటినట్లు తేలింది. అనుమానితుడిగా కస్టడిలోకి తీసుకొని విచారించారు. నేరం ఒప్పుకొని హత్య చేసిన ప్రదేశాన్ని చూపించినట్లు ములుగు సీఐ దేవేందర్ రెడ్డి తెలిపారు. గట్టమ్మ వద్ద అడవిలో శవం పూర్తిగా కుళ్లిపోయింది. అక్కడే శవ పంచనామా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - WOMEN MURDER
ములుగు జిల్లా కొడిషకుంటులో అమానుష ఘటన చోటుచేసుకుంది. చనువుగా ఉంటున్న వ్యక్తే హత్య చేసి అడవిలో వదిలేశాడు. మృతురాలి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు చేధించారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం