యునెస్కో ప్రతినిధి రాకతో అద్భుత శిల్పసంపదకు నిలయంగా మారిన రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ హోదాకు మరింత చేరువైంది. చారిత్రక కట్టడాలపై నిపుణులు పరిశోధనలు చేసి అణువణువూ పరిశీలించారు. సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సప్తస్వరాలు పలికే శిల్పాన్ని ఆసక్తిగా గమనించారు. దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను గురించిన సమాచారాన్ని కాకతీయ హెరిటేజ్ సభ్యులు యునెస్కో ప్రతినిధికి తెలియజేశారు. ఎక్కడికక్కడ చరవాణితో చిత్రాలు తీసుకుంటూ దాదాపు నాలుగు గంటలు ఆలయంలో గడిపారు.
'ఇప్పటి వరకు సంతృప్తిగానే సాగింది'
యునెస్కో ప్రతినిధి పర్యటన సంతృప్తికరంగా సాగిందని.. ఆలయానికి సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించారని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు.
వేయి స్తంభాల గుడి సందర్శన...