ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం బస్టాండ్ నుంచి కొంగల మడుగు, జంపన్న వాగుకు పోయే దారికి ఇరువైపులా భక్తులు బస చేస్తున్నారు. భక్తులకు వంటలు చేసేందుకు నిన్న సాయంత్రం నుంచి మంచినీరు లేక అవస్థలు పడుతున్నారు. సుధీర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తాగు నీరు లేక.. వంటలు వండుకోలేక పిల్లలు ఆకలి కోసం అలమటిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.
మేడారంలో మంచినీరు లేక భక్తుల అవస్థలు - మేడారం జాతర
వన దేవతలను దర్శించుకుందామని వస్తే మంచినీరు కొరతతో అవస్థలు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటలు వండేందుకు మంగళవారం సాయంత్రం నుంచి మంచినీరు లేదని వాపోతున్నారు.
మేడారంలో మంచినీరు లేక భక్తుల అవస్థలు
భక్తిశ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుందామనుకుంటే నీరు రాక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నల్లాల ద్వార మంచి నీరు వదలాలని కోరారు.
ఇవీ చూడండి:మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!