వన్యప్రాణులకు ఆహార కొరత లేకుండా వీలైనంత మేరకు గడ్డి మైదానాలు పెంచాలని వరంగల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఎంజే అక్బర్ అన్నారు. ఈ మేరకు ములుగు జిల్లా ఏటూరునాగారం రేంజ్ పరిధిలోని భూపతిపూర్, గూర్రేవుల, కన్నయిగూడెం అటవీ ప్రాంతంల్లో వన్యప్రాణుల దాహార్తి కోసం ఏర్పాటు చేసిన పర్కోలేషన్ ట్యాంక్ పనులను ఆయన పరిశీలించారు. గతంలో ఈ అటవీ ప్రాంతంలో పులి సంచరించిన కారణంగా కెమెరా ట్రాప్స్ నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.
'అడవుల్లోని ఆ ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వొద్దు' - వరంగల్ సీసీఎఫ్ అక్బర్ తాజా పర్యటన
అటవీ ప్రాంతాల నుంచి రాత్రి పూట జరిగే అక్రమ కలప, వన్యప్రాణులు, ఇసుక రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వరంగల్ సీసీఎఫ్ అక్బర్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ములుగు జిల్లా ఏటూరునాగారం రేంజ్ పరిధిలో ఏర్పాటు చేసిన పర్కోలేషన్ ట్యాంక్ పనులను ఆయన పరిశీలించారు.
అటవీ ప్రాంతాల నుంచి రాత్రి పూట జరిగే అక్రమ కలప, వన్యప్రాణులు, ఇసుక రవాణాపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సిబ్బందికి సీసీఎఫ్ అక్బర్ సూచించారు. ఎక్కువగా వన్యప్రాణులు సంచరించే ప్రదేశాలకు ఎవరిని అనుమతించరాదని అన్నారు. అటవీ సంపద రక్షణకు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్న ఆయన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వాజేడు రేంజ్ పరిధిలోని పూసూరు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రైసింగ్ ప్లాంటేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగతా జలపాతాన్ని సందర్శించిన సీసీఎఫ్ పర్యాటకుల కోసం తగన సౌకర్యాలు కల్పించాలని అధికారలను ఆదేశించారు. ఈ కార్యక్రమములో జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ఎఫ్‌డీవోలు నిఖిత, వీణా, వాణి తదితరులు పాల్గొన్నారు.