పల్లెల్లోను పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని పలు మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, మండలాలతో పాటు ములుగు మండలంలోని మల్లంపల్లిలో పాక్షిక లాక్డౌన్ అముల చేసేందుకు సమాయత్తమయ్యారు. గ్రామంలో మీటింగు ఏర్పాటు చేసుకుని ఈమేరకు తీర్మానించారు.
ములుగు జిల్లాలో పలు మండలాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్డౌన్ - తెలంగాణ తాజా వార్తలు
ములుగు జిల్లాలోని పలు మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. రోజురోజుకు కొవిజ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు నిర్బంధమే మందు అని ఈ నిర్ణయం తీసుకున్నారు.

mulugu
నేటి నుంచి ఈనెల 26 వరకు పట్టణాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని గ్రామపెద్దలు, అధికారులు నిర్ణయించారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని... ఎవరూ నిబంధనలు అతిక్రమించకూడదని నిర్ణయించుకున్నారు.
ఇదీ చూడండి:అకాలవర్షానికి నాశనమైన వరిధాన్యం