తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు జిల్లాలో స్వచ్ఛందంగా వారాంతపు లాక్​డౌన్​! - ములుగు జిల్లా లాక్​డౌన్​

ఆదివారం సెలవు కావడం వల్ల ప్రజలు ఎక్కువగా బయట తిరిగే అవకాశం ఉన్నందున.. ములుగు జిల్లా కేంద్రంలో వాణిజ్య సంస్థలు, వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటించారు. కరోనా కేసులు పెరగకుండా రాత్రి కర్ఫ్యూను పాటిస్తూనే ఆదివారం నాడు బంద్ ప్రకటించుకున్నారు.

weekend lockdown, ulugu district
weekend lockdown, ulugu district

By

Published : Apr 25, 2021, 4:59 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా వారాంతపు లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాత్రి కర్ఫ్యూను పాటిస్తూనే ఆదివారం నాడు బంద్ ప్రకటించుకున్నాయి.

ఆదివారం సెలవు కావడం వల్ల ప్రజలు ఎక్కువగా బయట తిరిగే అవకాశం ఉంది. అందువల్ల కరోనా కేసులు పెరగకుండా ఉండడానికి వాణిజ్య సంస్థలు, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. ఆదివారం రోజు ములుగులో జరిగే అంగడిని కూడా నిర్వహించకపోవడం గమనార్హం.

అత్యవసర సర్వీసులైన హాస్పిటల్, మెడికల్ షాపులు, కూరగాయలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంలు మినహా మిగతావాటిని నేడు స్వచ్ఛందంగా బంద్ చేశారు.

ఇదీ చూడండి:జైన తీర్థంకరుల పాదముద్రలతో తెలంగాణ పావనమైంది: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details