విభజన హామీలపై పార్లమెంటులో గళమెత్తారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. విభజన బిల్లులో ఇచ్చిన హామీలైన కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ అంశాలపై మట్లాడారు. గిరిజన యూనివర్సిటీకి గత బడ్జెట్లో రూ.1 కోటి, ఈసారి మరో కోటి రూపాయలు కేటాయించారని... వీటితో యూనివర్సిటీ ప్రారంభం సాధ్యమేనా అని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయాలని సభ ద్వారా హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
'2 కోట్లతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభం సాధ్యమేనా?' - Loksabha
విభజన హామీలపై పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ ఉత్తమ్. గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన 2 కోట్ల నిధులతో ప్రారంభం సాధ్యమేనా అంటూ నిలదీశారు.
tribal university