ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానలకు కొంగల, గుమ్మదొడ్డి, ఉసురు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాపూర్ మండలంలోని పాలెంవాగు ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుకు వరదనీరు భారీగా రావడం వల్ల నాలుగు గేట్లు ఎత్తి ఆరువేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వర్షాల వల్ల రాచపల్లి, తిప్పపురం, కలిపాక, కరోనిగొప్ప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలో వర్షాల కారణంగా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు - rains
ములుగు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. వెంకటాపూర్ మండలంలోని పాలెంవాగు ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేని వర్షాలు