కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లా పాలంపేటకు వెళ్లి... రామప్ప ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఆలయం వద్ద ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం అనంతరం ప్రాచీన కట్టడాన్ని పరిశీలించి.. యునెస్కో నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన ఆలయ అభివృద్ది పనులపై అధికారులతో సమీక్షిస్తారు. గట్టమ్మ దేవాలయం వద్ద పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
Union Minister Kishan Reddy : నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని(World Heritage Recognition to Ramappa Temple) కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఇవాళ సందర్శించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా రామప్ప, వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్‌ను సందర్శించి.. గట్టమ్మ దేవాలయం వద్ద పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
వారసత్వ సంపదగా రామప్పను గుర్తించిన తరువాత.... తొలిసారిగా కిషన్ రెడ్డి వస్తుండటం వల్ల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రామప్ప పర్యటన ముగించుకుని...కిషన్ రెడ్డి హనుమకొండ వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శిస్తారు. కల్యాణ మండపం పునర్నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తారు. ఖిలా వరంగల్‌ను కూడా సందర్శించి కోటలో సౌండ్, లైటింగ్ షోను కిషన్ రెడ్డి తిలకించి.. రాత్రి హనుమకొండలో బస చేయనున్నారు.