ములుగు జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏటూరునాగారం మండలం గోగుపల్లి శివపురానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ 5వ బెటాలియన్ ఏఎస్సైగా పని చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి బస్సులో స్వగ్రామానికి వస్తుండగా జ్వరం రావడం వల్ల ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చెంచుకున్నాడు. వైరస్ లక్షణాలు గుర్తించిన వైద్యులు వరంగల్ ఎంజీఎంకు పంపించారు. వైద్య పరీక్షలో కరోనా వ్యాధి నిర్ధరణ కావడం వల్ల అక్కడే చికిత్స పొందుతున్నారు. వెంకటాపూర్ మండలం నర్సాపూర్‌కు చెందిన కత్తుల హరీశ్‌కు కరోనా సోకింది. ఇతను కొంత కాలంగా క్యాన్సర్, లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు.
ములుగు జిల్లా మరో రెండు కరోనా కేసులు - corona cases in mulugu
కరోనా రాష్ట్ర రాజధానిలోనే కాదు జిల్లాల్లో కూడా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ములుగు జిల్లాలో మరో ఇద్దరికి కరోనా సోకింది. వారిద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ములుగు జిల్లా మరో రెండు కరోనా కేసులు