దేశానికి ప్రస్తుతం చౌకీదార్లు, తాతల పేర్లు చెప్పుకునే టేకేదార్లు అవసరం లేదని... అసలైన అభివృద్ధి చేసే కేసీఆర్ కావాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ములుగు బహిరంగసభలో పాల్గొన్న కేటీఆర్... మోదీపై విరుచుకుపడ్డారు. చేసిన అభివృద్ధి చెప్పమంటే... అవాకులు చెవాకులు పేలుతున్నారని విపక్షాలపై మండిపడ్డారు. మాలోత్ కవితతో సహా రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఎంపీలను గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
చౌకీదార్, టేకేదార్ కాదు దేశానికి కేసీఆర్ కావాలి
"మోదీ వేడి తగ్గింది. కాంగ్రెస్ గాడి తప్పింది. భాజపాకు 150, కాంగ్రెస్కు 100 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. దేశంలో నిజమైన జాతీయ పార్టీలు లేవు. ప్రాంతీయ పార్టీలతోనే అతిపెద్ద కూటమి ఏర్పాటవుతుంది."కేటీఆర్
ములుగు బహిరంగసభలో
TAGGED:
ts-trs-ktr-sabha