ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆచరణీయంగా మారాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టంచేశారు. మహబూబాబాద్ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ములుగులో ఓటమి పాలైనా... ఇచ్చిన మాట ప్రకారం జిల్లా చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. దేశంలో ఏ ప్రధాని, ఏ సీఎం చేయని ఆలోచన రైతుల కోసం గులాబీ బాస్ చేశారంటూ కొనియాడారు.
కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆచరణీయమయ్యాయి - ts-trs-ktr-sabha
పార్లమెంటు ఎన్నికల ప్రచార జోరు పెంచింది తెరాస. రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మాలోత్ కవితకు మద్దతుగా ములుగులో నిర్వహించిన సభలో తనదైన శైలి చతుర్లతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
![కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆచరణీయమయ్యాయి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2851893-931-662e06af-c1ac-45db-9585-cc4550e1fb01.jpg)
ములుగు బహిరంగ సభలో
Last Updated : Mar 30, 2019, 7:53 PM IST
TAGGED:
ts-trs-ktr-sabha