తెలంగాణ

telangana

ETV Bharat / state

'గెలిపిస్తే ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా' - minister

రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని మంత్రి దయాకర్​ రావు విజ్ఞప్తి చేశారు. 16 స్థానాల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు భారీగా నిధులు వస్తాయన్నారు.

ములుగు జిల్లా తెరాస కార్యకర్తల సమావేశం

By

Published : Mar 25, 2019, 10:24 PM IST

ములుగు జిల్లా తెరాస కార్యకర్తల సమావేశం
ములుగు జిల్లా కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్​ కవితతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ,మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ మాటకు కట్టుబడి ములుగు జిల్లా ఇచ్చి హామీ నెరవేర్చారని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కవితను మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఎంపీ సీతారాం నాయక్ టికెట్ రాలేదని చింతించవద్దని త్వరలోనే మంచి పదవి లభిస్తుందని భరోసా ఇచ్చారు.

కనిపెంచిన తండ్రి రెడ్యానాయక్​ అయితే రాజకీయ పునర్జన్మనిచ్చింది కేసీఆరేనని పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. తనకు ఓటేసి గెలిపిస్తే ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె తెలిపారు. రాబోయే కాలంలో జిల్లాలో ఉన్న పోడుభూముల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామి ఇచ్చారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details