ములుగు జిల్లాలోని గిరిజన సంక్షేమ భవన్లో కరోనా బాధితులకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ పాల్గొన్నారు.
కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి
కరోనా రోగులకు అన్ని సుదుపాయాలు కల్పిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ములుగు జిల్లాలోని గిరిజన సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను పరిశీలించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే
కొవిడ్ టెస్ట్ కోసం వచ్చిన వారిందరికి పరీక్షలు చేయాలని సీతక్క కోరారు. ఉదయం 10 వరకు టెస్టులు పూర్తి చేయాలన్నారు. మారు మూల గ్రామాలకు చెందిన కొందరు మొదటి డోసు వేసుకున్నారని.. వారికి సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేదని.. రిజిస్ట్రేషన్ లేకున్నా వారికి రెండో డోసు ఇవ్వాలన్నారు.