వరదల్లో కొట్టుకుపోతున్న ట్రాక్టర్లు.. ఏం చేయలేక బాధలో రైతు.. - godawari floods
![వరదల్లో కొట్టుకుపోతున్న ట్రాక్టర్లు.. ఏం చేయలేక బాధలో రైతు.. Tractors washed away in floods at alubaka village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15822072-75-15822072-1657794304528.jpg)
15:26 July 14
వరదల్లో కొట్టుకుపోతున్న ట్రాక్టర్లు.. ఏం చేయలేక బాధలో రైతు..
Tractors washed away in floods: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తున్నాయి. మరోవైపు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన గంప వెంకట్రావు అనే రైతు.. దుక్కులు దున్ని తన రెండు ట్రాక్టర్లను గోదావరి మధ్యలో ఉన్న లంకలో నిలిపి ఉంచాడు. అయితే.. ఐదురోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో.. ట్రాక్టర్లను ఇంటికి తీసుకురావటం కుదరలేదు. ఎగువ నుంచి వస్తున్న వరదలు.. లంకను చుట్టుముట్టేశాయి. గోదావరి ప్రవాహం ఎక్కవవటంతో.. లంకలో ఉన్న ట్రాక్టర్లు వరద నీటికి కొట్టుకుపోతున్నాయి. కళ్ల ముందే ట్రాక్టర్లు కొట్టుకుపోతున్నా.. ఏమీ చేయలేక వెంకట్రావు బాధపడుతున్నాడు.
మరోవైపు.. వెంకటాపురం మండలం నుంచి ఆలుబాక, తిప్పాపురం, ఏదిరా తదితర గ్రామాలకు వచ్చే విద్యుత్‌లైన్ ఆలుబాక గ్రామ సమీపంలో 33 కేవీ విద్యుత్ స్తంభం ఉన్న చోటు కుంగిపోయి వంగిపోయింది. వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఆలుబాక గ్రామస్థులు సీఆర్పీఎఫ్ జవాన్లు, విద్యుత్ శాఖ అధికారులు, సర్పంచ్, స్థానికులు శ్రమించి.. స్తంభాన్ని నిలబెట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ఇవీ చూడండి: