ములుగు జిల్లా వెంకటాపురం మండలం జిల్లా కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు పూనేం అనిల్, సర్సీలగా గుర్తించారు.
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు చిన్నారుల మృతి - ములుగు జిల్లా వెంకటాపురంలో రోడ్డు ప్రమాదం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం జిల్లా కాలనీ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు చిన్నారుల మృతి
ప్రమాదంలో మరో పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇవీచూడండి:ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
Last Updated : Mar 21, 2020, 6:37 AM IST