కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం జిల్లాలోని పర్యటక ప్రాంతాలకు పర్యటకులను అనుమతించొద్దని ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్‌శెట్టి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనా ఎఫెక్ట్: పర్యటకులకు అనుమతి రద్దు - లక్నవరం పార్క్
ములుగు జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే బొగత జలపాతం, లక్నవరం పార్క్‌లు కరోనా ప్రభావం వల్ల మూతపడ్డాయి. జన సమూహం ఎక్కువగా ఉండే పర్యాటక ప్రాంతాల్లోకి పర్యటకులను అనుమతించొద్దని జిల్లా అటవీశాఖాధికారి ప్రదీప్ శెట్టి అధికారులను ఆదేశించారు.
కరోనా ఎఫెక్ట్: ములుగులో పర్యాటకులకు అనుమతి లేదు
ప్రజలు అధికంగా వచ్చే ప్రదేశాలు మూసి వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యటక ప్రాంతాలైన బొగత జలపాతం, లక్నవరం పార్క్ వీక్షించేందుకు అనుమతించబోరని స్పష్టంచేశారు. వైరస్ నివారణకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:నాలుగు బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం