ప్రభుత్వ అధికారులు గిరిజనులపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని తుడుం దెబ్బ సంఘం నాయకుడు రవి అన్నారు. ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటోన్న గిరిజనులకు తక్షణమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
'పోడు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలివ్వాలి' - ములుగు జిల్లా తాజా వార్తలు
ఎన్నో ఏళ్లుగా తాము సాగుచేసుకుంటోన్న భూముల్లో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని తుండుదెబ్బ ఆధ్వర్యంలో ములుగు జిల్లా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
!['పోడు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలివ్వాలి' thudumdebba demand to governament for Tribals should be given graduate pass books immediately](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10320993-798-10320993-1611209342398.jpg)
'పోడు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలివ్వాలి'
పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఆదివాసీలు వాపోయారు. డబ్బులు ఇచ్చిన వారికే రెవెన్యూ కార్యాలయంలో పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు తక్షణమే పట్టా పుస్తకాలు ఇవ్వాలని లేకపోతే మరోసారి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కొత్తకొండ వీరభద్రస్వామికి.. భారీ ఆదాయం!