తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుని మృతి - ఉపాధ్యాయుని మృతి

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కళాశాలలో పనిచేసే మాజీ సైనిక ఉద్యోగి మరణించాడంటూ ఎటునాగారం మండల కేంద్రంలోని  సామాజిక వైద్యశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్​ ధ్వంసం చేశారు.

వైద్యుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుని మృతి

By

Published : Aug 25, 2019, 10:11 PM IST

ములుగు జిల్లా ఎటురునాగారం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థలో ​పంజాబ్ రాష్ట్రానికి చెందిన బోలా సింగ్ అనే మాజీ సైనిక అధికారి పనిచేస్తున్నారు. ఉదయం విద్యార్థులతో వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థులు పక్కనే ఉన్న సామాజిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్న బోలా సింగ్​ మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ ఉపాధ్యాయుడు​ చనిపోయాడంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్​ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

వైద్యుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుని మృతి

ABOUT THE AUTHOR

...view details