ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో ఇటీవల కురిసిన వర్షానికి పరిసరాలన్నీ జలమాయమైపోయాయి. మేడారం చుట్టూ పలు ప్రాంతాల్లో భక్తులు వదిలేసిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలు నీటిలో తడిసి దుర్గందం వెదజల్లుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికంగా ఉండే ప్రజలు దుర్వాసన పడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
కంపు కొడుతున్న మేడారం పరిసరాలు
మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కొత్తూరు, నార్లాపూర్, జంపన్న వాగు, చిలకలగుట్ట, పెద్ద చెరువు, తాడ్వాయి రహదారిపై నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కంపు కొడుతోంది. పారిశుద్ధ్యం పనులు వేగవంతం చేసినప్పటికీ దుర్వాసన వస్తుందని స్థానికులు అంటున్నారు. దుర్గందంకు పారిశుద్ధ్య కార్మికులు కూడా పనులు చేయలేకపోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.