తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా జనాభా 3 లక్షలు.. మాస్కులు 6 లక్షలు

కరోనా కట్టడికి చిన్న జిల్లా ములుగులో 6 లక్షల మాస్కుల తయారీకి సన్నద్ధం అయ్యారు. కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య చొరవతో స్వయం సహాయక సంఘాల ద్వారా నాణ్యమైన మాస్కుల తయారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. వాటిని సోమవారం పంపిణీ చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

By

Published : Apr 12, 2020, 9:32 AM IST

the district population is 3 lakhs masks are 6 lakhs in mulugu district
జిల్లా జనాభా 3 లక్షలు.. మాస్కులు 6 లక్షలు

ములుగు మారుమూలన అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చిన్న జిల్లా. అయినా, కరోనాపై పోరాటంలో ముందుంటోంది. కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య చొరవతో అధికారులు 6 లక్షల మాస్కులు తయారు చేయించాలని నిర్ణయించారు. జిల్లాలోని 200లకు పైగా స్వయం సహాయక సంఘాల ద్వారా నాణ్యమైన 6 లక్షల మాస్కులు తయారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే లక్ష మాస్కుల తయారీ పూర్తి చేశారు. వీటిని సోమవారం పంపిణీ చేస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.

జిల్లాలో 3.05 లక్షల మంది జనాభా ఉండగా ప్రతి వ్యక్తికి రెండు చొప్పున 6 లక్షల మాస్కులు తయారు చేయిస్తున్నారు. మాస్కుల తయారీకి 5 వేల మీటర్ల సిరిసిల్ల చేనేత వస్త్రాన్ని తీసుకొచ్చారు. ఒక మాస్కు కుట్టినందుకు రూ.3 చెల్లిస్తారు. వస్త్రానికి రూ.6 ఖర్చవుతోంది. వీటిని ఉచితంగా పంపిణీ చేయాలా లేదా నామమాత్రపు రుసుముతో విక్రయించాలా అనేది అధికారులు నిర్ణయించాల్సి ఉంది. విద్యార్థులకు మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :వెళ్లలేరు.. ఉండలేరు..

ABOUT THE AUTHOR

...view details