ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో పూజలు నిర్వహించిన పూజారులను ఇంఛార్జి కలెక్టర్ కర్ణన్ సన్మానించారు. ఈ నెల 5 నుంచి 8 వరకు జరిగిన మహాజాతరలో పూజారులు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ కర్ణన్ 2018 మేడారం జాతర సమయంలో భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి కలెక్టర్గా, 2020లో ములుగు జిల్లా ఇంఛార్జి కలెక్టర్గా నియమితులై మేడారం జాతరను విజయవంతంగా పూర్తిచేశారు. రెండుమార్లు సమ్మక్క సారలమ్మ వనదేవతల సేవ చేయడం ఎంతో తృప్తిగా ఉందన్నారు.
మేడారంలో సేవలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ - మేడారం జాతరలో పూజలు నిర్వహించిన పూజారులను ఇంఛార్జి కలెక్టర్ కర్ణన్ సన్మానించారు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పూజలు నిర్వహించిన పూజారులను ఇంఛార్జి కలెక్టర్ కర్ణన్ సన్మానించారు. జాతరలో సేవలందించిన పూజారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, తదితర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మేడారంలో సేవలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్
చిలకలగుట్టలో 800 ఎకరాల భూమి కావాలని పూజారులు కోరగా, రెండు రోజుల్లోనే ఉన్నతాధికారులతో కలెక్టర్ మాట్లాడారు. సిద్దబోయిన జగ్గారావు, కృష్ణమూర్తి పేర్ల మీదుగా భూఅడవి హక్కు పత్రం అందించామని, ఆ భూమిలో ఎలాంటి పోడు వ్యవసాయం చేయరాదని అన్నారు. జాతరలో సేవలందించిన పూజారులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, తదితర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
మేడారంలో సేవలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్
ఇదీ చూడండి :తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి