తెలంగాణ

telangana

ETV Bharat / state

40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి - గీత వృత్తి

తాటి చెట్లే వారికి జీవనాధారం..అలాంటి చెట్లను కూల్చేయడంతో గీత వృత్తి కార్మికులు రోడ్డున పడుతున్నారు.

40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి

By

Published : Aug 18, 2019, 2:10 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మిదేవిపేటలో గీత వృత్తితో బతికే గౌడ కుల‌స్థులు ఉన్నారు. రూపిరెడ్డి కృష్ణారెడ్డి అనే భూస్వామి 40 తాటి చెట్లను జేసీబీ సాయంతో నేలమట్టం చేయించాడు. దీంతో గౌడ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ గ్రామంలో మొత్తం 185 మంది గీత కార్మికులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు చెట్లు మాత్రమే వస్తాయి. తన భూమిలో ఉన్న తాటి చెట్లను కూల్చివేయడంతో పూర్తిగా జీవనం కోల్పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటి చెట్లు పెంచేందుకు ఐదెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వానికి, కలెక్టర్​కు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి

ABOUT THE AUTHOR

...view details