ములుగు జిల్లాకు దశలవారీగా పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. మొత్తం 9 మండలాల పరిధిలో 557 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలున్నాయి. వీటి పరిధిలో 36,765 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు జిల్లా విద్యా శాఖ ప్రణాళిక రూపొందించింది.
పాఠ్యపుస్తకాలు వచ్చాయ్..
లాక్‌డౌన్ నేపథ్యంలో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా శాఖ మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎప్పటిలాగే పాఠ్య పుస్తకాలను జిల్లాల వారీగా సమకూరుస్తోంది.
పాఠ్యపుస్తకాలు వచ్చాయ్..
జిల్లా వ్యాప్తంగా రెండో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 1,63,780 పాఠ్య పుస్తకాలు అవసరం ఉంటాయని అంచనా వేశారు. 43,200 పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు జిల్లాకు చేరుకున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే విద్యాశాఖ పాఠ్యపుస్తకాలన్నింటిని సిద్ధం చేసుకొని తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పుస్తకాలను ములుగులోని విద్యావనరుల కేంద్రం పక్కన గల భవనంలో భద్రపరుస్తున్నారు.