అసెంబ్లీ ముందే తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి స్థానిక ప్రజాప్రతినిధులు నివాళులు కూడా అర్పించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు.
అసెంబ్లీ ముందే ఉద్యమకారుడి ఆత్మహత్యాయత్నం బాధాకరం: సీతక్క - ఎమ్మెల్యే సీతక్క వార్తలు
ఉద్యమకారుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. అసెంబ్లీ ముందే ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
seethakka
ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు.
ఇదీ చదవండి:మండలి ఛైర్మన్ గుత్తా, మంత్రి శ్రీనివాస్ గౌడ మధ్య ఆసక్తికర చర్చ